సిద్దిపేట, ఫిబ్రవరి 6 : కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అన్ని ధరలు పెంచడంతో పాటు సబ్సిడీల్లో కోతలు విధిస్తూ రైతులు, సామాన్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట రూర ల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎర్ర యాదయ్యకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతుందన్నా రు. బీజేపీ తప్పడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేస్తున్నదని, ఏమి చేయకున్నా బీజేపీ అన్ని చేసినట్లు సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నదన్నారు. దానిని టీఆర్ఎస్ సోషల్ మీడి యా వారియర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.
రైతులపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం మోపుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రాష్ట్ర జీఎస్డీపీలో 4శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదన్నారు. వచ్చే సంవత్సరానికి 3.5 శాతం ఎప్పటిలాగే తీసుకోవచ్చన్నారు. కానీ, కేంద్రం అరశాతం కండీషన్ పెట్టిందన్నారు. విద్యుత్ చట్టంలో రీపామ్స్-సవరణలు చేయాలని, బాయిలకాడ మీటర్లు పెట్టాలని మెలిక పెట్టిందన్నారు.బాయిలకాడ మీటర్లు పెడితే అరశాతం అప్పు తీసుకోవటానికి అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పడంతో రాష్ర్టానికి రూ.5వేల కోట్లు కోత పడినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తనగొంతులో ప్రాణం ఉన్నంత వరకు బాయిలకాడ మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. మీటర్లు వద్దు, బీజేపీ వద్దు, మనకు కేసీఆర్ ముద్దు అని ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా టీఆర్ఎస్ కార్యకర్తలు వివారించాలని మంత్రి పిలుపునిచ్చారు. పెట్రో,డీజిల్, ఎరువుల ధరలు పెంచి, బాయిలకాడ మీటర్లు పెట్టి ముక్కు పిండి పైసలు వసూలు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కేంద్రమే వడ్లు కొన్నదని, బీజేపీ మాత్రం వడ్లు కొనమని ఇప్పు డు చెబుతున్నదని మంత్రి విమర్శించారు. రైతులకు అన్నివిధాలుగా చేయూతనిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు.
బట్టేబాజ్..జూటేబాజ్ పార్టీ బీజేపీ…
దేశంలో బట్టేబాజ్..జూటేబాజ్ పార్టీ బీజేపీ అని, బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి తిప్పికొట్టాలని టీఆర్ఎస్ క్యాడర్‌కు మంత్రిపిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రో,డీజిల్ ధర లీటర్‌కు రూ.10 పెంచుతారని, ఈ విషయాన్ని గ్రామ,వార్డు స్థాయి ల్లో చర్చకు తెరతీయాలని టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి సూ చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే, బీజేపీ రైతులను ముంచే ప్రయ త్నం చేస్తున్నదని మంత్రి విమర్శించారు.