సిద్దిపేట, ఫిబ్రవరి 4 : అంబేద్క ర్ తర్వాత దళితుల అభ్యున్నతికి పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో టీఆర్ఎస్వీ నేత లు యాదగిరి, బండి శ్రీకాంత్ తో కలిసి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉనికి కోసమే టీఆర్ ఎస్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రాష్ర్టాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని సీఎం కేసీఆర్ ఎండగట్టారన్నారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనే మనోవేదనతో మారిన కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారిస్తే ఎలా ఉంటుందని? ప్రజల్లో చర్చ పెట్టడానికే ప్రస్త్తావిస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. దళితులకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు బాలరాజు, రాజమౌళి, దినేశ్, సం పత్, మహేశ్, రంజిత్, రాకేశ్‌యాదవ్, తిరుపతి, అరవిందు ఉన్నారు.
సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని, ప్రజలను తప్పుతోవ పట్టిస్తు న్నాయని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం విమర్శిం చారు. మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన బయ్యారం యాదగిరికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంజూరు చేయించిన రూ.60వేల సీఎం ఆర్ఎఫ్ చెక్కును టీఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సం దర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అం శాలు దేశాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారన్నారు. స్థ్ధాయికి తగని వ్యక్తులు సైతం సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని, వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చ రించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు పెం డర్ల రాజశేఖర్‌యాదవ్, టీఆర్ఎస్ ఎస్సీ అధ్యక్షుడు నీరటి రాజలింగం ఉన్నారు.