మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 9 : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన లభిస్తున్నదని జిల్లా సెక్టోరియల్ అధికారి పూర్ణచందర్రావు అన్నారు. గురువారం ధూళిమిట్ట మండలం జాలపల్లిలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పూర్ణచందర్రావు మాట్లాడుతూ సర్కారు బడుల్లో ప్రభు త్వం ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టిందన్నారు. బడుల్లో మౌ లిక వసుతల కల్పనకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం హేమాచందర్రావు, ఉపాధ్యాయులు సురేందర్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి..
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలని జిల్లా సెక్టోరియల్ అధికారి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రా మంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బస్వరాజు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సర్పంచ్ శ్యామల, ఎస్ఏంసీ చైర్మన్ పాల్గొన్నారు.
పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలి..
పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఎంపీపీ సాయిలు అన్నారు. మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రాజిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో..
కొమురవెల్లి మండలవ్యాప్తంగా ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని వసతుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వర్గల్లో..
బడీడు పిల్లలను వెంటనే బడిలో చేర్పించాలని తున్కిఖల్సా సర్పంచ్ సంధ్యాజానీ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పర్యటించి సమస్యలను గుర్తించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మేరీస్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, కారోబార్ నగేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.