చేర్యాల, జూన్ 9: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే, ఓర్వలేని ప్రతిపక్ష బీజే పీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వంపై అసత్య ప్రచారా లు చేయడం పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, కమిషనర్ రాజేం ద్రకుమార్తో కలిసి చేర్యాలలోని 5వ వార్డులోని బీడీ కాలనీలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయించారు. పలు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షలకు అధికా రం మీద వ్యామోహం పెరిగిందని, ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా వారు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు.
బీడీకాలనీ భూములను సమగ్ర సర్వే చేయాలి
పేదల కోసం ఏర్పాటు చేసిన బీడీకాలనీ భూముల ను సమగ్ర సర్వే చేయాలని తహసీల్దార్ ఆరిఫాకు ఎమ్మె ల్యే ఆదేశాలు జారీ చేశారు. పాత రికార్డులు, మ్యాప్‌ను ఓపెన్ చేసి, నాడు ఎవరెవరికి భూములు కేటాయించారు? కేటాయించిన భూమి ఎంత? తదితర అంశాలను సమగ్రంగా నివేదిక తయారు చేయాలన్నారు. సర్వే నిర్వహించే సమయంలో ఖాళీ భూములు వెలుగులోకి వస్తే వాటిలో ప్రభుత్వ భూమి గా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉండని, రైతులకు ఇబ్బందులు పెడుతున్న చేర్యాల సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లాస్థాయి అధికారికి ఫోన్లో సూచించారు. కాగా, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఎమ్మె ల్యే పర్యటిస్తున్న ప్రదేశానికి వచ్చి, దరఖాస్తులపై సంతకాలు చేయాలని కోరగా, అక్కడే ఉన్న ఓ అరుగుపై కూర్చోని, ఎమ్మెల్యే సంతకాలు చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు నరేందర్, చంటి, సతీష్, కోఆప్షన్ సభ్యులు నాగేశ్వర్రావు, జేబాబేగం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బాల్‌నర్సయ్య, టీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జి అంజయ్య, మహిళా పట్టణ అధ్యక్షురాలు మానస, నాయకులు తదితరులు పాల్గొన్నారు.