అక్కన్నపేట/హుస్నాబాద్ రూరల్, జూన్ 9: పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన పథకమే పల్లెప్రగతి అని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. గురువారం అక్కన్నపేట మండలం మల్లంపల్లి, హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామాల్లో పర్యటించారు. డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాలను పరిశీలించారు. సేంద్రియ ఎరువు తయా రీ విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతిని నేడు దేశవ్యాప్తంగా అమల చేసేందుకు కేంద్రం ఆలోచనలు చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె ప్రగతిని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. పల్లెప్రగతితో జాతీయ స్థాయిలో నేడు గ్రామాలకు గుర్తింపు వస్తోందన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద దేశంలోనే టాప్ 10లో తెలంగాణ గ్రామాలు నిలువడం పల్లె ప్రగతికి నిదర్శమన్నారు. 2014 ముందు తెలంగాణ పరిస్థితి, ఇప్పడున్న తెలంగాణ చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమే శ్, డీపీవో దేవకీదేవి, ఎం పీపీలు మాలోతు లక్ష్మి, మానస, జడ్పీటీసీ మం గ, సర్పంచులు తిరుపతి, పిట్టల సంపత్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంపీడీవోలు సత్యపాల్‌రెడ్డి, అనిత, మం డల ప్రత్యేకాధికారి సీతారాం, ఎంపీవో కుమార్, ఏపీవో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.