గజ్వేల్, జూన్ 9 : గజ్వేల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన యువకుడు గుడాల శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అతనికి కృత్రిమ కాలు ఏర్పాటుకు రూ.3లక్షల ఎల్వోసీని మం జూరు చేశారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ కొద్దినెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయాడు. శ్రీనివాస్‌కు కృత్రిమకాలును ఏర్పాటు చేసేందుకు సహాయం చేయాలని పలువురు సోషల్ మీడియాలో వేడుకున్నారు. పలువురు దాతలు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని డీసీఎంఎస్ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, శ్రీనివాస్‌కు కృత్రిమకాలును ఏర్పాటు చేయడానికి, అవసరమైన వైద్యఖర్చుల కోసం ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 3లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. ఈ మేరకు పేదకుటుంబానికి చెందిన శ్రీనివాస్ వైద్యానికి సహకరించినందుకు స్థానికులు సీఎం కేసీఆర్‌కు, ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.