గజ్వేల్,జూన్2: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, టీఆర్ఎస్ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకుంటూ జైతెలంగాణ, జైకేసీఆర్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి జెండా ఆవిష్కరణ చేసి పారిశుధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఐవోసీ ప్రాంగణంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, కోర్టులో జడ్జి వెంకటమాలిక్ సుబ్రహ్మణ్యన్,ఆయా కార్యాలయాల వద్ద ముఖ్య అధికారులు జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణాశ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు పాల్గొన్నారు.
జయశంకర్‌కు మంత్రి నివాళి
సిద్దిపేట,జూన్ 2:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సిద్దిపేట ముస్తాబాద్ సర్కిల్లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు.మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటీ రాధాకృష్ణ శర్మ ఉన్నారు.
అమరవీరులకు…
సిద్దిపేటలోని రంఘదాంపల్లి ఆమరవీరుల స్థూపం వద్ద మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, సిద్దిపేట సీపీ శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి ఉన్నారు.
అమరవీరుల సేవలను స్మరిద్దాం : సీపీ శ్వేత
సిద్దిపేట టౌన్, జూన్ 2 : తెలంగాణ సాధనలో అమరులైన వీరులను స్మరిద్దామని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాలు ఛేదిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు మహేందర్, రామచందర్‌రావు, సుభాష్‌చంద్రబోస్, ఇన్స్పెక్టర్లు భానుప్రకాశ్, నాగేశ్వర్, శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
భరోసా సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
భరోసా సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత సూచించారు. భరోసా సెంటర్ సిబ్బందితో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఫోక్సో, అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ అధికారులు తీసుకువచ్చి వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. బాధితులకు ఎవరూ లేనప్పుడు సిద్దిపేట బాలసదనంలో ఆశ్రయం కల్పించాలని సూచించారు. భరోసా సెంటర్ సేవల గురించి డయల్ యువర్ 100, కమిషనరేట్ కంట్రోల్ నంబర్ 8333998699కు ఫోన్ చేసి సహకారం పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీవో శివకుమారి, భరోసా అడ్మినిస్ట్రేటర్ రేఖ తదితరులు పాల్గొన్నారు.