కోహెడ, జూన్ 2 : మండలంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు ఇస్తున్న ప్రోత్సాహాకాలు ఫలితాలిస్తున్నాయి. మటన్ 800 నుంచి వెయ్యి రూపాయలు, చికెన్ రూ.300 ధర ఉంది. వేల రవులు, బొచ్చెలు 70 నుంచి 100 రూపాయల మధ్య అమ్ముతున్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. మత్స్యకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మండలంలో చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి.
మండలంలో 100 లోపు ఆయకట్టు ఉన్న చెరువులు, కుంటలు 126, ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువుల 7, సింగరాయ, శనిగరం ప్రాజెక్టులు చేపల పెంపకానికి అనువుగా ఉన్నాయి. శనిగరం, గుండారెడ్డిపల్లి, వింజపల్లి, సముద్రాల, నాగసముద్రాల, బస్వాపూర్, కోహెడ, చెంచెల్‌చెర్వుపల్లి, పరివేద, కూరెల్ల తదితర గ్రామాల్లో మత్స్యకారుల సహకార సంఘాలు ఉన్నాయి. మిషన్ కాకతీయలో చెరువులు, కుంటలు మరమ్మతులు చేయడం చేపల పెంపకానికి కలిసొచ్చింది.
ఈయేడు చేపలు బాగా పెరిగాయి
ఈయేడు చేపలు బాగా పెరిగా యి. లోకల్‌గా అమ్ముతున్నాం. పట్నం కూడా పంపుతున్నాం. తెలంగాణ వచ్చినాక సీఎ కేసీఆర్ సార్ చెరువులు, కుంటలను మిషన్‌కాకతీయ కింద మంచిగ చేసిండు. వానలు బాగా పడ్డాయి. చెరువుల్లో చేపలు మంచిగా పెరుగుతున్నాయి. లాభాలు వస్తున్నాయి.
-ఈగ మల్లయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, కూరెల్ల
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు
చెరువులు, కుంటలను మిషన్‌కాకతీయ కింద మంచిగ చేసిండు. ఉచితంగా ఇచ్చిన చేపపిల్లలు మంచి పెరిగాయి. సంఘం ఆధ్వర్యంలో అమ్ముతున్నాం. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన పథకాలు మంచిగున్నాయి. ముఖ్య మంత్రి సార్‌కు కృతజ్ఞతలు.
-బాబు, మత్స్య సహకార సంఘం సభ్యుడు, కూరెల్ల)