గజ్వేల్,మే17: విద్యారంగానికి తెలంగాణ సర్కా రు పెద్దపీట వేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ ప్రాంగణంలోని గడా సమావేశ మందిరంలో ‘మన ఊరు – మన బడి’లో భాగం గా మొదటి విడతలో ఎంపిక చేసిన నియోజకవర్గంలోని 89 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతలో రూ.30లక్షల్లోపు ఖర్చయ్యే పాఠశాలలు 43, రూ.30 నుంచి రూ.కోటి వరకు నిధులు ఖర్చయ్యే 46 పాఠశాలలను గుర్తించామన్నారు. మొదట 43 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు, మురుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతి, బోధన సామగ్రి తదితర పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మిగతా 46 పాఠశాలల్లో సాధారణ మౌలిక వసతులతో పాటు అదనపు తరగతుల నిర్మాణం, నూతన భవన నిర్మాణాలు చేపడుతామన్నారు. నియోజకవర్గంలోని 86 పాఠశాలల అభివృద్ధికి గానూ రూ.54కోట్లను సీఎంకేసీఆర్, మంత్రి హరీశ్‌రావు మంజూరు చేయించినట్లు తెలిపారు.
మొదటి విడత పనులను ఈనెలఖరులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపాఠశాలల్లో సీటు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉందని, వచ్చే విద్యాసంవత్సరం ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గజ్వేల్‌లో నిర్మించిన ఎడ్యుకేషనల్ హబ్‌లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు కల్పిస్తూ విద్యబోధన జరుగుతున్నదన్నారు. దీనితో పాటు గురుకుల పాఠశాలల్లోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని గుర్తుచేశా రు. సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, జిల్లా విద్యాధికారి రవికాంతారావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ మధుసూదన్‌రావు వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.