కోహెడ, మే 17 : దళితబంధుతో దళితులు ఆర్థికాభి వృద్ధి సాధించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని తంగళ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు మోయతుమ్మెద వాగు వద్ద ప్రమా దవశాత్తు మామ, అల్లుడు మృతి చెందారు. సోమవారం రాత్రి మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. దళితబంధు ద్వారా మంజూరైన ఆటోమొబైల్ సామగ్రిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..
మండలంలోని వరికోలు గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరికిషన్‌రెడ్డి కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాజేశ్వర్‌రావుకు పరామర్శి..
రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజేశ్వర్‌రావు ఇటీవల గుండెపోటుకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ కోహెడలో చికిత్స పొందుతున్న రాజేశ్వర్‌రావును పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, ఎంపీపీ కీర్తి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, నాయకులు ఉన్నారు.
నేడు టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం..
నేడు హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్స్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హాజరవుతారని చెప్పారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.