హుస్నాబాద్, మే 17: ఉచిత శిక్షణ శిబిరాలు నిరుపేదలకు ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట అడిషనల్ డీసీపీ ఎస్ మహేందర్ అన్నారు. హుస్నాబాద్‌లో టెట్ కోసం ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్కిరెడ్డి మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు ఉపాధ్యాయులు 45రోజులుగా నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరం ముగింపు మంగళవారం పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తున్నందున గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు సరైన మెటీరియల్, శిక్షణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టెట్కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు 45రోజులు నాణ్యమైన శిక్షణ ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు టెట్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, పాధ్యాయులు పాల్గొన్నారు.