రామయంపేట/ రామాయంపేటరూరల్/ వెల్దుర్తి/ పాపన్నపేట, మే 5 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్విని యోగం చేసుకోవాలని రామాయంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ పా పయ్యగారి రాజిరెడ్డి అన్నారు. గురువారం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, భిక్షపతి, మంగ్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, ఇమ్మాడి శ్రీనివాస్, రవీందర్, కార్యదర్శి జ్ఙానేశ్వర్, పర్యవేక్షకులు హనుమాండ్లు, డీఈవో శ్రీనివాస్ ఉన్నారు.
ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని రైతుబంధు సమితి రామాయంపేట మండలాధ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి అన్నారు. అక్కన్నపేట గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వగ్గు గంగాధర్, ఐకేపీ ఏపీఎం రాములు, వార్డు సభ్యుడు ఎల్లగారి రాజు, ఏఈవో తేజస్విని, జంగం సిద్ధిరాములు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : మండల ప్రత్యేకాధికారి
ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికే మద్దతు ధర ఇస్తూ ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని మండల ప్రత్యేక అధికారి సుభాషిణీ తెలిపారు. మండలకేంద్రం మాసాయిపేట లో సహకార సంఘం కొనుగోలు కేంద్రాన్ని ఏవో రాజశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఆధైర్య పడొద్దని, పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామ న్నారు. రైతులు తేమ తక్కువగా, తాలు లేకుండా ధాన్యాన్ని కొ నుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు పట్టాపాసుపుస్తకం, బ్యాంకు ఖాతాపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఇవ్వాలని వివరించారు. వీరివెంట ఏఈవో రజిత, రైతులు ఉన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జడ్పీటీసీ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ అన్నారు. వెల్దుర్తి మండలంలోని దామరంచ, ధర్మారం, అందుగులపల్లి, మంగళపర్తి, యశ్వంతరావుపేట గ్రామాల్లో వెల్దుర్తి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏవో ఝాన్సీ, సీఈ వో సిద్ధ్దయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, కొను గోలు కేంద్రాలకు తీసుకునిరావాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రామతీర్థం గ్రామంలో గురువారం పాపన్నపేట పీఏసీఎస్ చైర్మన్ పుల్లన్నగారి మోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ షాహీద్పాషా, సంఘం ప్రసాద్, సర్పంచ్ లక్ష్మీదుర్గయ్య, ఉపసర్పంచ్ ఈశ్వరప్ప,, ఏఈవో నాగరాజు, వార్డుసభ్యులు రైతులు పాల్గొన్నారు.