సిద్దిపేట అర్బన్, మే 5 : సిద్దిపేటకు కొద్ది రోజుల్లోనే రైలు రాబోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అర్బన్ తహసీల్దార్, మార్కెటింగ్ డీఎంలతో పలు అంశాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ మేరకు పెండిగ్లో ఉ న్న పలు అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడా రు. దుద్దెడ వరకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని, దుద్దెడ నుండి సిద్దిపేట వరకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు వెంటనే పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, సిద్దిపేట రైల్వే స్టేషన్, దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు రై ల్వే పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీ సుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు వెంటనే అందజేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్యాడీ క్లీనర్స్ అందుబాటులో తేవాలని చెప్పారు. ఎన్సాన్‌పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరబెట్టాలని సూచించారు.
పిడుగుపాటుతో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా, రైతుబీమా
జిల్లాలో పిడుగు పాటుతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, వ్యవసాయ శాఖ ద్వారా రూ.5 లక్షల రైతుబీమా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం నర్రంగలగడ్డలో అకాల వర్షానికి పిడుగుపాటుకు గురై మృతి చెందిన చౌడ పోచయ్య తండ్రి ఎల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భం గా ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు కూడా ఇస్తామని.. వెంటనే చెక్కు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగుపడి పశువులు మృతి చెందిన వివరాలతో పాటు పంట నష్టపోయిన వివరాలపై విచారణ చేపట్టి వారికి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున చేర్యాల ప్రభుత్వ ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలను మెదక్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలోకి మార్చాలని అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనం కోసం రూ.25 కోట్లు మంజూరయ్యాయని, ఎన్సాన్పల్లి పరిధిలో స్థలం ఎంపిక చేశారన్నారు. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంగునూరు, చిన్నకోడూరు మండలంలోని మిగిలి పోయిన కాలువల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మందపల్లి వద్ద నిర్మించే ఆటోనగర్ పనులు వెంటనే చేపట్టాలని, అందుకు అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు.