సిద్దిపేట/చిన్నకోడూరు, మే 5 : నాడు కరువుతో అల్లాడిన ప్రాం తం.. తాగునీటికే గోసపడ్డ మన ప్రాంతం.. నేడు కల్పతరువుగా.. సాగు, తాగు నీరు ఇచ్చే ప్రాంతంగా ఆవిష్కృతమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 1వ వార్డు లింగారెడ్డిపల్లి, చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ మహంకాళి ఉత్సవాలు, మేడిపల్లి, అనంతసాగర్ గ్రామాల్లోని పెద్దమ్మ, పెద్ది రాజుల కల్యాణ మ హోత్సవంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సాగు, తాగునీటి గోస తీర్చడంతో పాటు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. పరిశ్రమలకు పవర్ హాలీడే ఇచ్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా ఇస్తూ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. మన సిద్దిపేట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ, సాగు, తాగు నీరు ఇస్తున్న రంగనాయకసాగర్ రాబోయే రోజుల్లో రూ.100 కోట్లతో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసుకోబోతున్నామన్నారు.
దేశ విదేశాల్లో తరహాలో డెస్టినేషన్స్, హోటల్స్, వాటర్ హబ్ గా గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. చంద్లాపూర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామన్నారు. రంగనాయకస్వామి గుట్టకు సీసీ రోడ్డు, రూ. 50 లక్షలతో రంగనాయకస్వామి, రే ణుకా ఎల్లమ్మ దేవాలయం అభివృ ద్ధి చేసుకుంటున్నామన్నారు. లింగారెడ్డిపల్లి గ్రామానికి పట్టణ హంగులు వచ్చాయని, రాబోయే కొద్ది రోజుల్లో నాలుగు వరుసల రహదారి కాబోతుందన్నారు. బట్టర్ైప్లె లైట్స్, మధ్యలో డివైడర్ చెట్లతో అద్భుతంగా చేసుకుంటున్నామని చెప్పా రు. మహంకాళి అమ్మవారి దయతో అందరికీ శుభం చేకూరాలని చెప్పారు. రెండేండ్ల నుంచి కరోనాతో ఉత్సవాలు జరుపుకోలేక పోయామన్నారు. ఈ సంవత్సరం గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలు పండుగలా జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యారెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.