కొల్చారం, మే 2 : సీఎం కేసీఆర్ పాలనలో.. తెలంగాణలో రైతే రాజు అని, రైతాంగం క్షేమం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది.. రైతులు అధైర్యపడొద్దని ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట, సంగాయిపేట, చిన్నాఘన్‌పూర్, కొల్చారం,అంసాన్పల్లి, వరిగుంతం గ్రామాల్లో పీఏసీఎస్ కేంద్రాలను, పోతంశెట్‌పల్లి, వెంకటాపూర్, వసురాంతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సోమవారం జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ అరిగె రమేశ్, సర్పంచ్‌లు మాసన, సుజాత, నాగరాణి, ఇందిరాప్రియదర్శిని, మన్నె శ్రీనివాస్, కరెంటు ఉమ, వైస్‌ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీలు ఎల్లయ్య, మాధవి, ఉదయ, సొసైటీ చైర్మన్లు మనోహర్, చిన్నారపు ప్రభాకర్, మంద నాగులు, మన్నె రాములు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కొల్చారం మండలంలోని 40 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, నయబ్ తహసీల్దార్ కిశోర్‌కుమార్, గిర్దావర్ శ్రీహరి పాల్గొన్నారు.
ఆర్థిక భారం మోస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గొల్పర్తి గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కా వాలనే తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదన్నారు. అయినా, సీఎం కేసీఆర్.. ఆర్థిక భారమైనా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. ధాన్యం నగదును సరైన సమయంలోనే రైతులకు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రామాయంపేట మండ లంలో 11వేల ఎకరాల్లో వరి పంట వేశారని, 23వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నందన్నారు. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై ట్రాక్టర్ షోరూం ప్రారంభించి ట్రాక్టర్ నడిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైరపర్సన్ విజయలక్ష్మి, సీనియర్ నేత పుట్టి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, వార్డు సభ్యులు చిలుక గంగాధర్, దేవుని రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ గజవాడ నగరాజు, నిజాంపేట ఎంపీసీ సిద్ధిరాములు, టీఆర్ఎస్ నిజాంపేట మండ లాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు మహేశ్, అందె కొండల్‌రెడ్డి, ఏవో రాజ్‌నారాయణ, ఐలయ్య, నర్సింహులు, కొండల్‌రెడ్డి, సిద్ధ్దిరాంరెడ్డి, మల్యాల కిషన్, శ్రీనివాస్, యాదగిరి ఉన్నారు.
నిజాంపేటలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె ల్యే ప్రారంభించారు. నిజాంపేట మండలంలో 8 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, సుమారుగా 20 వేల టన్నుల ధాన్యం వస్తుందని, ఇందుకు తగినట్టుగా 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, పీఏసీఎస్ చైర్మన్లు కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, డైరెక్టర్లు, ఏవో సతీశ్, ఏఈవో కావేరి, రైతుబంధు సమితి మండలా ధ్యక్షుడు సంపత్, కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్వై మండ లాధ్యక్షుడు రాజు, గ్రామాధ్యక్షుడు నాగరాజు, తిరుమల ఆల య కమిటీ చైర్మన్ మహేశ్, సర్పంచ్‌లు అనూష, నర్సింహరెడ్డి, ఎంపీటీసీలు లహరి, బాల్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, లక్ష్మీనర్సింహులు, రాములు, నగేశ్, సంతోశ్, ఎల్లం ఉన్నారు.
సీఎం కేసీఆర్ రైతుబంధువు: జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్
సీఎం కేసీఆర్ నిరంతరం రైతు సం క్షేమానికి కృషి చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, లింగారెడ్డిపేట, ముప్పిరెడ్డిపల్లి, పర్కిబండ గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతబంధువు అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఏవో స్రవంతి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ నవనీతారవిముదిరాజ్, వైస్‌ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ స్వర్ణలత, సర్పంచ్‌లు అర్జున్, ప్రభావతి, నర్సయ్య, రేణుకాఆంజనేయులు, సుగుణ మ్మ, నాగభూషణం, ఉపసర్పంచ్ రేణుకుమార్, నేతలు పెంటాగౌడ్, భిక్షపతి, నరేందర్‌గౌడ్, సుధాకర్, శ్రీరామ్ పాల్గొన్నారు.
ఆందోళన వద్దు : ఇఫ్కొ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి
రైతులు ఆందోళన చెందొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండలంలోని జప్తిశివునూర్, సంకాపూర్, సంకాపూర్తండా, శేరిపల్లి గ్రామా ల్లో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. చేగుంట మండలంలోని చందాయిపేటలో ఐకేపీ కొ నుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ జమాల్పూర్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, నాయకులు తౌర్యానాయక్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీఎంలు అశోక్, లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్‌లు స్వర్ణలత, మల్లేశం, షేక్ షరీఫ్, ఆర్.సుజాత, సొసైటీ, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
ఇబ్బంది రానివ్వొద్దు : ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నర్సాపూర్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సూచించారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీ లించారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, హమాలీలను అందుబాటులో ఉంచామని, తరుగు పేరుతో మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివ్వంపేటలో సర్యేనెంబర్ 315, 316 భూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఆర్ఐ కిషన్ ఉన్నారు.
కేంద్రాల్లో మద్దతు ధర : ఎంపీపీ, జడ్పీటీసీ
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ అనంతరెడ్డి అన్నారు. మాసాయిపేట, కొప్పులపల్లి, వెల్దుర్తి మండలంలోని శెట్పల్లి, బండపోసాన్‌పల్లి, ఏదులపల్లి, ఉప్పులింగాపూర్, నెల్లూర్, హస్తాల్పూర్ గ్రామాల్లో వెల్దుర్తి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు లత, నరేందర్‌రెడ్డి, భూమ య్య, మమత, లక్ష్మి, ఎంపీటీసీలు బాబు, కృష్ణారెడ్డి, డైరెక్టర్ నర్సింహులు, ఏవో రాజశేఖర్, నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మైసయ్య, సునందరెడ్డి, రాజురెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇం ద్రారెడ్డి, దుర్గాగౌడ్, నారాయణరెడ్డి, ఏఈవోలు ఉత్తమ్, రవి, రజిత, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అండ : ఎంపీపీ నారాయణరెడ్డి
రైతుకు ప్రభుత్వం అండగా ఉం టుందని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. కొచ్చెరుతండా, సర్దన, హవేళీఘనపూర్, బొగుడభూపతిపూర్, జక్కన్నపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, ఏవో నాగమాధు, ఏఈవో విజృంభన, సర్పంచ్‌లు సవిత, తారీజెమ్లానాయక్, శ్రీనునాయక్ ఉన్నారు.
దళారులకు విక్రయించొద్దు : ఎంపీపీ భాగ్యలక్ష్మీ
రైతులు ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీపీ భాగ్యలక్ష్మీ సూచించారు. జంగరాయి గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చందాపూర్‌లో సర్పంచ్ రమాదేవి, వెంకట్రావ్‌పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ నరసయ్య ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ జ్యోతి, ఏఎంసీ డైరెక్టర్ మేఘమాల, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, వ్యవసాయ అధికారులు శ్రీనివాస్, మౌనిక, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పర్యటన
నర్సాపూర్ నియోజకవర్గంలో మంగ ళవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పర్యటిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం గౌరీశంఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నర్సాపూర్ మండలంలోని మంతూర్, ఖాజీపేట్, బ్రా హ్మణపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే, రెడ్డిపల్లి, మహ్మదాబాద్, తుల్జారాంపేట్, గూడెంగడ్డ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు ప్రారంభిస్తారని వెల్లడించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశా ల హౌసింగ్ బోర్డు బస్టాప్ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రామాయంపేట పర్యటన ముగించుకొని మెదక్‌కు వస్తుండగా కళ్ల ముందు జరిగిన ప్రమాదం చూసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పం దించిన అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.