రామాయంపేట, మే 2 : విద్యార్థులు ప్రణాళికాబద్ధ్దంగా కష్టపడి చదివితే విజయం వరిస్తుందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేటలోని అయ్యప్ప ఆల యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 400 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఇఫ్కో డైరెక్టర్ కోచింగ్ సెంటర్‌ను సందర్శించి, విద్యార్థులతోపాటు శిక్షకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదవండి.. మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశామని.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చెప్పాలని సూచించారు. ఎదైనా అవసరం ఉంటే రామాయంపేట సీఐ, ఎస్సై, పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. సార్ మాకెలాంటి ఇబ్బందులు లేవు.. కోచింగ్ ను మరో గంటపాటు పొడిగిస్తే ఇంకా బాగా చదువుతామని వి ద్యార్థులు కోరారు.మీకు చదవు చెప్పించే పూర్తి బాధ్యత నాదేనని.. అక్కడే ఉన్న సబ్జెక్టు టీచర్‌కు విషయం తెలిపారు.
కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, యాదగిరి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, నాయకులు పుట్టి యాదగిరి, మెట్టు యాదగిరి, శ్రీకాంత్ సాగర్, కర్రె రమేశ్, గంగాధర్, శ్యాంసుందర్, చం ద్రపు కొండల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, విద్యాకర్రాజు పాల్గొన్నారు.