రామాయంపేట/ రామాయంపేట రూరల్, ఏప్రిల్ 9 : ఇంగ్లిష్‌లో విద్యార్థులకు విద్యాబోధనను చక్కగా నేర్పించా ల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని కేఆర్పీ అంజుమ్, ఆర్పీలు అంజు, బసిరా, ప్రభాకర్ సూచించారు. శనివారం రామాయంపేట బాలుర ఉన్నత పాఠశాలలో అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ సౌజన్యంతో ఇంగ్లిష్ విద్యాబోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రామాయంపేటలో ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలి పారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ విద్యాబోధన చేపట్టాలనే లక్ష్యంతో ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ మేరకు ప్రతి ఉపా ధ్యాయుడికి ఇంగ్లిష్ మాద్యమ విద్యాబోధనపై శిక్షణ ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేయాలని సూచించారు. శిక్షణలో పాపన్నపేట, మెదక్, హవేళీఘనపూర్, చేగుంట, నిజాంపేట, టేక్మాల్, చిన్నశంకరంపేట, పెద్ద శంకరంపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అక్కన్నపేట జిల్లా పాఠశాలలో శిక్షణ
ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మాద్యమం విద్యాబోధన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని రామాయంపేట మండల విద్యాధికారి నీలకంఠం సూచించారు. అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ బోధనపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లిష్ అర్థమయ్యే విధానాలు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, మౌలిక వసతుల మెరుగుదలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి
ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్‌పై అవగాహన ఉండాలని మండల విద్యాధికారి బుచ్చానాయక్ పేర్కొన్నారు. నర్సాపూర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలిం చారు. కార్యక్రమంలో ఆర్పీలు వాణిశ్రీ, హర్షవర్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.