
కోహెడ/హుస్నాబాద్‌రూరల్/కొండపాక/నంగునూరు/వర్గల్/ మిరుదొడ్డి, జూలై 8 : పల్లె ప్రగతిలో మొక్కలతో పల్లెలు ఆకు పచ్చని తోరణాలుగా మారాలని డీపీవో పార్థసారథి అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామాన్ని 4వ విడుత పల్లె ప్రగతి పథకంలో భాగంగా అకస్మిక తనిఖీ చేసి పల్లె ప్రకృతి వనం, డపింగ్షెడ్, ప్లాంటేషన్‌ను పరిశీలించారు. జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, సర్పంచ్ ఎనుగంటి కిష్టయ్య, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, ఉప సర్పంచ్ దిలీప్ గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె నిద్ర : ధర్మారంలో బుధవారం రాత్రి ఎంపీడీవో రాజిరెడ్డి సర్పంచ్ గూళ్ల పుష్ప బాగులు, అధికారులతో కలిసి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
హరితపట్టణంగా తీర్చిదిద్దుకుందాం..
హుస్నాబాద్‌టౌన్, జూలై 8 : హుస్నాబాద్ పట్టణాన్ని హరితపట్టణంగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న అన్నారు. పట్టణంలోని 10,11,12వ వార్డుల్లో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ సమస్యల గురించి తెలుసుకుని, పూల మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మాజీఎంపీపీ ఆకుల వెంక ట్, కౌన్సిలర్లు గూళ్ల రాజు, దొడ్డి శ్రీనివాస్, గోవింద్ రవి, కో- అఫ్షన్ సభ్యుడు శంకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ధూళిమిట్ట మండలంలో..
ధూళిమిట్ట, జూలై 8 : పల్లె ప్రగతి పనులు చకచకా సాగుతున్నాయి. లింగాపూర్‌లో సర్పంచ్ ముక్క కనకయ్య ఆధ్వర్యంలో హరితహారాన్ని ప్రారంభించారు. సర్పంచ్ గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. హనుమతండా లో జరుగుతున్న పనులను ఎంపీవో సుధీర్ కుమార్ పరిశీలించారు. లింగాపూర్ ఉపసర్పంచ్ జల్ల స్వరూప, వార్డు సభ్యులు, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి భాస్క ర్ ఉన్నారు.
మద్దూరులో అధికారుల ‘పల్లె నిద్ర’
మద్దూరు, జూలై 8 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా ఎస్సీ కాలనీలో ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అధికారులు పల్లెనిద్ర చేశారు.
గాగిళ్లాపూర్‌లో…
గాగిళ్లాపూర్‌లో హరితహార కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తులు రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి కందకట్ల శ్రీధర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కొమురవెల్లి జోరుగా పల్లె ప్రగతి..
కొమురవెల్లి, జూలై 8 : ఎస్సీ కాలనీలో సర్పంచ్ బొడగం పద్మ ఆధ్వర్యంలో ఎంపీడీవో అనురాధతో పాటు పలువురు అధికారులు పర్యటించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరరాజు, గ్రామ ప్రత్యేకాధికారి విజయసారథి, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ఉపసర్పంచ్ పరశురాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రసూలాబాద్‌లో పల్లె నిద్ర..
రసూలాబాద్‌లో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి ఆధ్వర్యం లో బుధవారం రాత్రి అధికారులు పల్లె నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీవో వీరరాజు, వైస్‌ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ సురేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నారాయణరావుపేటలో..
నారాయణరావుపేట, జూలై 8 : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు. మాటిండ్ల గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ లతతో కలిసి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. సర్పంచ్ కొంగరి నారాయణ, ఏపీవో స్రవంతి, పంచాయితీ కార్యదర్శి రమేశ్, టెక్నికల్ అసిస్టెంట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
చేర్యాలలో..
చేర్యాల, జూలై 8 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీలోని పలు వార్డులలో కొనసాగుతున్నది. గురువారం పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కొనసాగుతున్న పనులను వారు పరిశీలించడంతో పాటు మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్, జుబేదా ఎక్బాల్, యాట కనకమ్మ యాదగిరి, ఏఈ అన్వేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నంగునూరు మండలంలోని మార్కెట్లో యార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మండలంలోని పందిల్ల, మాలపల్లి, జిల్లెలగడ్డ, గాంధీనగర్ తదితర గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లు ఇంటింటికీ వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. కోహెడ ఎర్రగుంటపల్లిలో ఏర్పాటు చేసిన నర్సరీని జడ్పీటీసీ శ్యామలతో కలిసి ఎంపీపీ కీర్తి మొక్కలను పంపిణీ చేశారు.
పాత ఇండ్ల కూల్చివేత
తొగుట, జూలై 8 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లింగంపేటలో గురువారం సర్పంచ్ మంగ రేణుక నర్సింహులు ఆధ్వర్యంలో జేసీబీతో పాత ఇండ్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.