చేర్యాల, మే 8 : ఏదైనా సంఘటన జరిగితే మహిళలు మౌనం వీడి పోలీసులకు తెలియజేయాలని హుస్నాబాద్ షీ టీమ్ సభ్యులు కోరారు. మండలంలోని వేచరేణి గ్రామ దేశాయి బీడీ కంపెనీలో గురువారం మహిళా చట్టాల పై కార్మికులకు షీ టీమ్ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు మాట్లాడుతూ సైబర్ నేరాట పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాట్సాప్కు వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దన్నారు.
ఎవరైనా బ్యాంకు అధికారులమని మాట్లాడితే బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ తెలుపవద్దన్నారు. అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దని, సమస్యలుంటే డయల్ 100 లేదా 8712667434 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో షీటీమ్ సభ్యులు సదయ్య, ప్రశాంతి, స్వప్న, కృష్ణ తదితరులున్నారు.