HCU Issue | చేర్యాల, మార్చి31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని అడ్డుకున్నందుకు విద్యార్థులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్‌కుమార్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ ఆహంకారాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శించారు.
యూనివర్సిటికీ సంబంధించిన 400 ఎకరాల భూమిని కార్పోరేట్ సంస్థలకు వేలం వేయడాన్ని విరమించుకోవాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెనిన్రాజు, సంజు, రాజు, భరత్, చరణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం