Seetharamula Rathotsavam | రాయపోల్, ఏప్రిల్ : దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఇవాళ స్వామివారు రథంపై ఊరేగారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. యువకుల కేరింతలు, నృత్యాలు బాజా బాజంత్రిల మద్యం రాములోరి రథోత్సవం ముందుకు సాగడంతో దారి పోడవున యువకులు, గ్రామస్తులు, మహిళలు మంగళ హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సీతాసమేతుడైన శ్రీరామచంద్రమూర్తి విమాన రథంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు రథోత్సవం ముందు వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ధర్మకర్త అన్నారెడ్డి సుభాష్ రెడ్డి దంపతులు, విజయరాజంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకుని రథోత్సవాన్ని లాగారు. గ్రామ పురవీధుల్లో రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడంతో భక్తి పరవస్యం పెంపొందించింది. రథోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం అన్నారెడ్డి సుభాష్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో రథోత్సవం విజయవంతం అయ్యింది.