గజ్వేల్, నవంబర్ 7: విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ మున్సిపల్ (Gajwel) పరిధిలోని ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో వివిధ రకాల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయి. రెండో రోజు ఎక్స్పోను తిలకించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు తరలివస్తున్నారు.
అన్ని అంశాలపై రూపొందించిన ఈ ఎక్స్పోలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు రూపొందించిన తెలుగు పండుగలు, మహాభారతం లాంటివి ఆకట్టుకునేవిగా ఉన్నాయి. ఎక్స్పో సందర్భంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఎంతో ప్రేరణ కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఇన్నారెడ్డి, ప్రిన్సిపాల్ రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
