మిరుదొడ్డి, మే 9 : రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసే పంటలకు తక్కువ మోతాదులో రసాయ ఎరువులను వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమాదేవి అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి టౌన్లో రైతులకు సాగు పద్దతుల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాన కాలంలో రైతులు కొనుగోలు చేసిన వివిధ రకాల విత్తనాలకు వెంటనే రశీదులను పొందాలని సూచించారు.
వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటల పై రైతులు దృష్టిని సారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో దిగుబడులలో కూడా గణనీయమైన మార్పు ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏవో బోనాల మల్లేశం, ఏఈవో రేఖ, రైతులు తదితరులు పాల్గొన్నారు.