Rayapol | రాయపోల్, డిసెంబర్ 27: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా రేకులపల్లి నర్సింహా రెడ్డి ఎన్నికయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ప్రత్యేకంగా సమావేశమై సర్పంచ్ ఫోరం అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులుగా వడ్డేపల్లి సర్పంచ్ రేణుక రాజా గౌడ్, ఆరేపల్లి సర్పంచ్ దివ్యకృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా బేగంపేట సర్పంచ్ గీతా ప్రవీణ్, ఎలుకల్ సర్పంచ్ పిట్ల చిన్న వెంకటయ్య, కార్యదర్శులుగా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి స్వామి, సభ్యులుగా మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, టెంకంపేట సర్పంచ్ వాసు, అనాజిపూర్ సర్పంచ్ నిర్మల ఇస్తారి. కొత్తపల్లి సర్పంచ్ ఎక్కాల శ్యామల మల్లేశం, వీరారెడ్డి పల్లి సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రేకుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల సర్పంచ్ ల ఫోరం బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాల అభివృద్దికి వినియోగించేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. సర్పంచ్లకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు. మండల సర్పంచ్ల ఫోరం బాధ్యతలను అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.