హుస్నాబాద్, డిసెంబర్ 12 : హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. గతంలో ఎన్న డూ లేని విధంగా భారీ మొత్తంలో వడ్లను కొనుగోలు చేశారు. డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూ రు, ధూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన 108 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. కొనుగోలు కేంద్రాలకు వడ్లు రాకపోవడంతో ఇప్పటి వరకు 20 కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. నిన్నటి వరకు వడ్ల రాసులు, రైతులు, హమాలీలు, చాట కార్మికులు, వివిధ వాహనాలతో కళకళలాడిన కొనుగోలు కేంద్రా లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. మెట్టప్రాంతమైన హుస్నాబాద్ డివిజన్లో ఈసారి రికార్డు స్థాయిలో వడ్లు పండ గా వీటిని కొనుగోలు చేస్తారా? లేదా? అని రైతులు మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి, రైతుల్లో భరోసాను నింపింది. దీంతో డివిజన్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తదిదశకు ధాన్యం సేకరణ
హుస్నాబాద్ డివిజన్లో 80 శాతా నికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయి. వడ్లు రాకపోవడంతో 20 కొనుగోలు కేంద్రాలను మూసివేశాం. త్వరలోనే మిగతా వడ్లును కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేస్తాం. వర్షాలతో కొనుగోళ్లకు ఆటంకం జరిగినప్పటికీ రైతులందరికీ చెందిన వడ్లను సకాలంలోనే కొనుగోలు చేశాం. ఇందుకు అధికారులు, ప్రజాప్రజాప్రతినిధులు, మిల్లర్ల సహకార ఎంతో ఉంది. డబ్బు లు రాని రైతులకు త్వరలోనే ఖాతాల్లో డబ్బులు చేస్తాం. ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.
– జయచంద్రారెడ్డి, ఆర్డీవో – హుస్నాబాద్