అదనపు బాధ్యతలు.. అధికారుల సతమతం
దేశంలోనే మేటి మున్సిపల్ కార్పొరేషన్‌గా వెలుగొందిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కళ తప్పింది. పాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మహానగరాన్ని మూడు ముకలు చేయడమే కాకుండా, పరిపాలనను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది.
- విశ్వనగరం విచ్ఛిన్నం
- పాలన అస్తవ్యస్తం
- మూడు ముకలాటతో ముగిసిన గ్రేటర్ వైభవం
- ఒకేరోజు 603 మందికి పైగా సిబ్బంది బదిలీ
- ప్రజా సమస్యలు గాలికొదిలేసిన సర్కార్
- గడిచిన కొన్ని నెలలుగా ముందుకు కదలని ఫైళ్లు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మేటి మున్సిపల్ కార్పొరేషన్‌గా వెలుగొందిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కళ తప్పింది. పాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మహానగరాన్ని మూడు ముకలు చేయడమే కాకుండా, పరిపాలనను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. మూడు రోజుల కిందట వెలువడిన విభజన ఉత్తర్వులతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతున్నది. అప్పటి వరకు వేలాది మంది సందర్శకులు, అధికారుల సందడితో కళకళలాడిన కార్యాలయం.. ఇప్పుడు సిబ్బంది కొరతతో నిశ్శబ్దంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒకే గొడుగు కింద ఉన్న వ్యవస్థను విడగొట్టడం వల్ల ఆస్తుల పంపిణీ, సరిపడా సిబ్బంది సర్దుబాటులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఫలితంగా సామాన్య ప్రజలు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల నుంచి నిర్మాణ రంగ అనుమతుల కోసం ఏ కార్యాలయానికి వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. గడిచిన రెండు నెలలుగా మొత్తానికి హైదరాబాద్ మహా నగర అభివృద్ధిని గాలికొదిలేసి, విభజన మంత్రంతో లబ్ధి పొందాలని చూస్తున్న సరారుకు రాబోయే రోజుల్లో నగర ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అదనపు భారంతో..
సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నది. ఒకే అధికారికి రెండు మూడు విభాగాల బాధ్యతలు ఇవ్వడంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలాకు మలాజిగిరి కార్పొరేషన్ హెల్త్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు సికింద్రాబాద్ జేసీతో పాటు అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం బాధ్యతలు అప్పగించారు. శంషాబాద్ జేసీ చంద్రకళకు ఎలక్షన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా నియమించారు. మొత్తంగా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ హడావుడి నిర్ణయాల వల్ల అభివృద్ధి పనులు మందగించడమే కాకుండా, ప్రజలకు అందాల్సిన కనీస సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నగర భవిష్యత్‌ను పణంగా పెట్టి చేస్తున్న ఈ మూడు ముకలాట ఎటు దారితీస్తుందోనని నగరవాసులు ఆందోళన మిగతా చెందుతున్నారు..
వికటించిన పారిశుధ్యం..
మహా నగరాన్ని మూడు ముకలు చేస్తే పరిపాలన పరుగులెత్తుతుందని, ఇంటి ముంగిటకే పౌర సేవలు వస్తాయని నమ్మబలికిన సరారు తీరా విభజన తర్వాత చేతులెత్తేసింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత నగరం పారిశుధ్య పరంగా మరింత అధ్వానంగా తయారైంది. అధికార వికేంద్రీకరణ కాస్తా ‘అస్తవ్యస్తం’గా మారిపోయింది. ఫలితంగా కాలనీలన్నీ చెత్తకుప్పలుగా మారుతుంటే, మురుగునీరు రోడ్లపై పారుతున్నది. దోమల బెడద కూడా పెరిగింది. విభజన పుణ్యమా అని సిబ్బంది కేటాయింపు, వాహనాల సర్దుబాటులో అధికారులు తలమునకలయ్యారు. అటు పాత బల్దియాకు, ఇటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఏ డివిజన్ ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందో తెలియక, ఫిర్యాదు చేయడానికి వెళ్తే ‘మా పరిధి కాదు’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన రహదారులు, కాలనీలు, గల్లీలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ ఆటోలపై నియంత్రణ లేకపోవడం, మరోవైపు వీధిదీపాల నిర్వహణ అటకెకింది.
దోమల దండయాత్ర..
ట్రై కార్పొరేషన్ల పరిధిలో దోమల బెడద పతాక స్థాయికి చేరింది. సాయంత్రం 6 దాటిందంటే చాలు.. కిటికీలు తెరిచే పరిస్థితి లేదు. డ్రోన్లతో స్ప్రేయింగ్ మాట దేవుడెరుగు, కనీసం ఫాగింగ్ చేసే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు.ఈ క్రమంలోనే పారిశుధ్య లోపం, దోమల విజృంభనతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కికిరిసిపోతున్నాయి. పాలనను మార్చాలని ముకలు చేసిన ప్రభుత్వం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దికుతోచని స్థితిలో ఉద్యోగులు
విభజన ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీ నుంచి సుమారు 603 మందికి పైగా కీలక అధికారులను, సిబ్బందిని కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లకు బదిలీ చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 303 మంది అధికారులు, సిబ్బంది, మలాజిగిరికి 300 మంది అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. అడ్డగోలుగా జరిగిన ఈ బదిలీలు సేవలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అవగాహన లేని వారికి కొత్త బాధ్యతలు, సంబంధం లేని విభాగాలకు సిబ్బందిని నియమించడం ద్వారా గడిచిన మూడు రోజులుగా వందలాది దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక నిలిచిపోయాయి. దీంతో పౌరుల ఇబ్బందులు అధికమయ్యాయి. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పలు విభాగాలు ఖాళీ అయ్యాయి. పాత సిబ్బంది వెళ్లిపోవడం, కొత్త వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఫైళ్లు ఎకడికకడ నిలిచిపోవడం గమనార్హం.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

