Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 02: సిద్దిపేట జిల్లా రాయపోల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సుగంధలతకు తెలంగాణ ప్రభుత్వం మెరిట్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. 2025–26 విద్యా సంవత్సరంలో నిష్ఠతో, అంకితభావంతో విధులు నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది.
పాఠశాల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకుగానూ సుగంధలతను పాఠశాల విద్యాశాఖ అభినందించింది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ సర్టిఫికెట్ను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్, జేడీ వెంకట నర్సమ్మ, రాష్ట్ర గెకో శిరీష, జిల్లా గెకో నర్మద పాల్గొన్నారు.