కొడంగల్, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రా ణించేలా చర్యలు తీసుకుంటున్నది. వందలాది గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ను అందిస్తున్నది. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేందుకు ఉపాధ్యాయులు శిక్షణను ఇస్తున్నారు. ప్రత్యేక తరగతులు, టెస్టులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వేసవి సెలవుల్లోనూ సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నా రు. పట్టణానికి చెందిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఎంజేపీ సొసై టీ ఆధ్వర్యంలో కీసరగుట్టలోని బోగారంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరిగిన జిల్లాస్థాయి ఆట లపోటీల్లో 30 మంది విద్యార్థులు పాల్గొని రాణిం చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి తెలిపారు. కళాశాలలో ఎంపీసీ ద్వితీయ ఏడాది చదువుతున్న మనోజ్ అనే విద్యార్థి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నగేశ్‌తోపాటు విశ్వనాథ్, పాండు, అరవింద్, సాయిప్రసాద్, ఉర్మిరాంలు ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. కళాశాలకు చెందిన పీడీలు అశోక్‌కుమార్, సురేశ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ క్రీడ ల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.