నిజాంపేట/మద్దూరు (ధూళిమిట్ట) : తూప్రాన్ మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిజాంపేట ఈద్గా వద్దకు ముస్లింలు చేరుకుని నమాజ్ చేసి ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు ఖురాన్ సూక్తులను బోధించారు. అనంతరం అందరూ ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు.