Rajeev Yuva Vikasam | చిన్నశంకరంపేట, మార్చి29 : రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవడానికి గడువు పెంచాలని బీఆర్ఎస్ మండల యువత ప్రధాన కార్యదర్శి అత్తిలి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవాళ నాగరాజు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 5 చివరి గడువు ఉన్నందున వరుస సెలవులు రావడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కుల ఆదాయ, ధృవపత్రాలు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
తహశీల్దార్ కార్యాలయంలో సర్వర్ సమస్య వల్ల కుల ఆదాయ ధృవపత్రాలు రాక యువకులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచాలని కోరారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.