గజ్వేల్, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని అక్కారం ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితసేలో భాగంగా హరితసేన జిల్లా ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరిత సేన జిల్లా ఇన్ చార్జి చెప్యాల రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రజా నాయకుగె, తెలంగాణ యువ కెరటం మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కేసీఆర్ హరితహారం చేపట్టి కొట్లాది మొక్కలు నాటడం వల్ల తెలంగాణలో పచ్చదనం శాతం పెరిగిందన్నారు.
విద్యార్థులు మొక్కలు నాటే సంస్కృతిని చిన్న నాటి నుండే అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడడంలో మన వంతు మనం పాత్ర పోషించాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఇలాంటి కార్యక్రమంతో కోట్లాది మొక్కలు నాటి ప్రతి ఒక్కరిని భాగస్వమ్యం చేస్తున్మ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బాలచంద్రం, రాజు, గజ్వేల్ నియోజకవర్గం ఇన్ చార్జి అనిల్ మొగిలి, గజ్వేల్ మండల హరితసేన ఇంచార్జి రాచకొండ మహేష్, నాయకులు రమేష్ రెడ్డి, నరేష్, పంజా నరసింహులు, గొల్ల వెంకటేష్ పాల్గొన్నారు.