సిద్దిపేట టౌన్,మార్చి 28: దేశంలో ప్రభుత్వ విద్యకు సమానంగా ప్రైవేటు విద్యకు ప్రాధాన్యత ఇస్తే ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవి, మధులు అన్నారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో యూఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ ప్రభుత్వ విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు.
యూనివర్సీటీలలో వైస్‌ఛాన్స్‌లర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఫారసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నాచారం శేఖర్, నాయకులు వికాస్, ప్రవీణ్, కరుణాకర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఏ మెంబర్‌గా సూర్యవర్మ
సిద్దిపేట టౌన్,మార్చి 28 : సిద్దిపేట జిల్లా ఆర్టీఏ రీజనల్ (ట్రాన్సోఫోర్ట్స్ ఆథారిటీ ) మెంబర్‌గా సిద్దిపేటకు చెందిన లక్కరసు సూర్యవర్మ నియామకమయ్యరు.ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూర్యవర్మకు శుక్రవారం నియమాక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ మాట్లాడుతూ.. రవాణా శాఖలో పారదర్శకంగా సేవలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.