రాయపోల్ డిసెంబర్ 07 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండంలోని మంతూర్ గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడి పిస్తానని బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పర్వేజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. గతంలో తాను ఎంపీపీ కో ఆప్షన్ సభ్యునిగా పని చేశానని అనుభవం ఉందన్నారు. రాజకీయాల్లోని స్వార్థంగా సేవ చేస్తామని, తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు సేవ చేసే భాగ్యం కలిపిస్తే ప్రజ లందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో తమ తండ్రి గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశాడని గుర్తు చేశారు. తనకు ప్రజ సేవా చేయాలని తపన ఉందని గ్రామస్తులు అలోచించి ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పేర్కొన్నారు.