రాయపోల్, మే 04 : పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి కలుగుతుందని పాల రామా గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని మంతూర్ గ్రామానికి చెందిన పడిగే లక్ష్మి, రాములు కూతురు నవ్య పెళ్లికి పుస్తె మట్టెలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సేవ చేస్తే ఎంతో సంతోషం కలుగుతుందన్నారు. ఇందులో భాగంగానే గత ఐదు సంవత్సరాల నుంచి వివిధ గ్రామాల్లో నిరుపేదలకు అండగా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతి సంవత్సరం నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. తనకు పదవి ఉన్న లేకున్నా పేద ప్రజల ప్రయోజనాలే ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం లో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పట్నం యాదగిరి, మాజీ సర్పంచ్ బందరం మల్లేశం, నాయకులు జీడిపల్లి జనార్దన్ రెడ్డి, ఈరమైన యాదగిరి, చందు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.