ACP Narismlu | రాయపోల్, జులై 24 : పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారునితో మర్యాదగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు అన్నారు. గురువారం రాయపోల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని, సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని సూచించారు.
వీపీఓ వ్యవస్థను మెరుగుపరిచి వారంలో రెండు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇసుక, పీడీఎస్ రైస్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస, ఏఎస్ఐలు రాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు