రాయపోల్ ఆగస్టు 22 : ఉపాధి హామీ పనులు గ్రౌండింగ్ పనులు పూర్తి చేశామని ఎంపీడీవో గఫూర్ ఖాద్రీ
అన్నారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. గ్రౌండింగ్ చేసిన పనులలో పశువుల షెడ్లు, గొర్ల షెడ్, ఈత ప్లాంటేషన్, నాడెపు కంపోస్ట్ పిట్, అజోళ్ల పిట్, ఇంకుడు గుంతలు గ్రౌండింగ్ చేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలకు సన్మానం చేశారు.
అదే విధంగా గాజులపల్లి, లింగారాజ్ పల్లి, లింగాయిపల్లి పశువుల షెడ్లను ప్రారంభించారు. ముబారస్ పూర్లో పూర్తి చేసుకున్న పశువుల షెడ్ కి సంబంధించి రూ.68000 రూపాయల చెక్ లబ్ధిదారునికి అందజేశారు. గాజులపల్లిలో జరిగిన ఈత ప్లాంటేషన్, పశువుల షెడ్ ఇనాగరేషన్ కార్యక్రమంలో సూపర్ఇండెంట్ జైపాల్ రెడ్డి , ఏపీవో రాజు ఏపీఏం మహిపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హంసకేతాన్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పాల్గొన్నారు.