సిద్దిపేట, జూన్ 13 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ పూర్తిగా అమలు చేయడంలో అపసోపాలు పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. శ్రుకవారం సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గురువారెడ్డి వ్రిగహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతుందన్నారు.
జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టాలన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పాకిస్తాన్ ఉగ్రవాదులతోను చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది కానీ, నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఐదు లక్షల మందితో నిర్వహిస్తామన్నారు. ఈ కార్య్రకమంలో నాయకులు కిష్టాపురం లక్ష్మణ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.