తూప్రాన్, మార్చి 5: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ అవిశ్వాస సమావేశాన్ని నేడు నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్‌పై 11 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తూప్రాన్ మున్సిపల్లో మొత్తం 16 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా, బీఆర్ఎస్ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, స్వ తంత్రులు ఇద్దరు ఉన్నారు. కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్‌తో వైస్ చైర్మన్ సహా కొంతమంది సభ్యులకు విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ సహా ఎనిమిది మంది సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు.
ఫిబ్రవరి 12న అవిశ్వాస తీర్మాన నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం అవిశ్వాస సమావేశం నిర్వహించనున్నారు. మం గళవారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినొద్దీన్, సీఐ కృష్ణ, ఎస్ఐ శివానందంతో కలిసి ఆర్డీవో పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, లైవ్ వీడియో రికార్డింగ్‌లతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలకు ఆదేశించారు.