నాగల్గిద్ద, మే 20 : దశాబ్దాల కల నిరీక్షణకు తెరపడనుం ది. మంత్రి హరీశ్‌రావ్, స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషితో కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కర్ణాటక బాడర్ వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. మోర్గి వద్ద రూ. 632లక్షల నిధులతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే కంగ్టి, నారాయణఖేడ్, మనూర్ నాగల్గిద్ద మండలాల ప్రజలకు బీదర్‌కు వెళ్లే దూరం తగ్గతుంది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణం కొనసాగిస్తాయి. గతంలో సింగిల్ రోడ్డు ఉండి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండటంతో ఎప్పు డు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని వాహనదా రు లు భయపడేవారు.
దీంతో పాటు మోర్గిలో మోడల్ పాఠశాల కళాశాల ఉండటంతో సుదూర ప్రాంతం నుంచి వాహనాలపై వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్యను ఉమ్మడి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషితో మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడంతో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణంతో పాటు అనేక పనులు జరిగాయి. మోర్గి డబుల్ రోడ్డు నిర్మాణ పూర్తి కావడంతో పాటు హైవే బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతుండటంతో రాష్ట్ర సరిహద్దు గ్రామాలపై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.