చిన్నశంకరంపేట, ఏప్రిల్25: మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సరీల నిర్వాహకులను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. సోమవారం చిన్నశంకరంపేటలోని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మండలంలోని సూరారం, జంగరాయి, గవ్వలపల్లి గ్రామాల్లోని పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. మొక్కల పెంపకంపై పలు సూచనలిచ్చారు. నర్సరీల్లో రైతులకు ఉపయోగపడే టేకు, అల్లనేరడి వంటి మొక్కలు పెంచాలన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. చిన్నశంకరంపేట మండలాన్ని హరిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో శంకర్‌నాయక్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఎంపీవో గిరిధర్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజిరెడ్డి, జ్యోతి, నీరజ మంగాదేవి, ఈజీఎస్ ఏపీవో వెంకటసాయి, టీఆర్ఎస్ నాయకులు ఏకే యాదవరావు, ప్రభాకర్, పవన్‌గౌడ్, ఈజీ ఎస్టీఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.