 
                                                            Siddipet: మద్యానికి బానిసైన యువకుడు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట (Siddipet) జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాగేందుకు రూ.5 వేలు ఇవ్వాలని తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో తల్లితో గొడవకు దిగాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
                            