రాయపోల్ జనవరి 16 : పేదలను ఆదుకోవడంలో ప్రజాహిత ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంస్ధ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంగం నవీన్ తల్లి చనిపోయారు. విషయం తెలుసుకున్న
ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో వారి కుటుంబానికి రూ. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని వర్గాల నిరుపేదలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పేదలకు ఏదోరకంగా సేవ చేయడమే లక్షంగా గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు ప్రవీణ్, నరేష్ ,నవీన్, ముత్యాలు, కుమార్ ,స్వామి ,నవీన్, మహేష్ రాయుడు,భాను , అజయ్,తదితరులు ఉన్నారు.