సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..పవన్ కుమార్(30) అనే వ్యక్తి ఏడేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏమైందో తెలియదు కాని ఆదివారం హాస్పిటల్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.