న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తీవ్ర అనిశ్చితంగా మారుతున్న వేళ ఐక్యరాజ్యసమితి(యూఎన్) వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం ప్రారంభమైంది. యూరప్, పశ్చిమాసియాలో కొనసాగున్న యుద్ధాలు, మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ శక్తి సమీకరణల్లో మార్పుల నడుమ ఈసారి సమావేశానికి వచ్చిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, మంత్రులు గత ఏడాదితో పోలిస్తే మరింత సంక్షిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ‘ప్రపంచ నేతలు తీవ్ర అనిశ్చితి నెలకొన్న కాలంలో ఐక్యరాజ్యసమితికి వస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ శక్తి సమీకరణలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా మన సంస్థలు కూడా మారాలి’అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలపై జరుగుతున్న దాడులు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, వాతావరణ మార్పులు, శాంతి భద్రతలపై ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటం వంటి అంశాలను పలువురు దౌత్యవేత్తలు ప్రస్తావించారు.
ఐక్యరాజ్య సమితి సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరి, ఆ దేశ పునర్నిర్మాణానికి అవకాశం కల్పించాలా? లేక ఇస్లామిక్ రిపబ్లిక్‌ను పూర్తిగా నాశనం చేయాలా అనే విషయంలో తన దగ్గర కీలక నిర్ణయం ఉందన్నారు.
ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు కొనసాగిస్తున్న విదేశీ కంపెనీలపై అదనపు ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఇరాన్ విమానయాన సంస్థలు అంతర్జాతీయ ప్రయాణాల నుంచి దూరం కావచ్చని అమెరికా ట్రెజరీ శాఖ మంత్రి బెస్సెంట్ ప్రకటించారు.
అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే కొన్ని విమానాశ్రయాల్లో ఒక ప్రధాన కమ్యూనికేషన్ వైఫల్యం కారణంగా సోమ, మంగళవారాలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వందలాది విమానాలు రద్దు కాగా, వేలాది విమానాలకు అంతరాయం కలిగింది.
తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించి, కీలక జలమార్గం వద్ద ఉన్న సైనిక ఒత్తిడిని తగ్గిస్తే వారం రోజుల్లోనే హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ సంకేతాలు ఇచ్చినట్టు ఇరాన్ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ క్యోడో వార్తాసంస్థ పేర్కొంది.