ఎనిమిదేళ్ల కథకు కొత్తరూపం?
సూర్య కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం మణిరత్నం విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా రొమాంటిక్ డ్రామా ‘ఇంజివెల్లం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సూర్య కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం మణిరత్నం విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా రొమాంటిక్ డ్రామా ‘ఇంజివెల్లం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఆయన సూర్యతో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే మణిరత్నం సూర్యకు ఓ కథను వినిపించారట.
అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే స్క్రిప్ట్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేసి సూర్యకు మరోసారి వినిపించే యోచనలో మణిరత్నం ఉన్నారని తెలిసింది. సూర్య అంగీకరిస్తే ఓ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. గతంలో మణిరత్నం-సూర్య కాంబినేషన్లో ‘ఆయుధ ఎళుత్తు’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘నవరస’ ఆంథాలజీలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి తాజా సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

