వీచే గాలికి అత్తరద్దిందెవ్వరూ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘ఏందయ్యా సామీ’ అనే పాటను విడుదల చేశారు. నాయకానాయికల పెళ్లి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత శోభాయమానంగా ఉందో ఈ పాటలో ఆవిష్కరించారు.
అజయ్-అతుల్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. శ్వేతామోహన్, అజయ్ గోగవలే ఆలపించారు. ‘ఏందయ్యా సామీ..ఇట్ల గాస్తాందీ వెన్నెల, ఉపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరూ, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా..’ అంటూ అర్థవంతంగా ఈ పాట సాగింది. 19వ శతాబ్దం బ్రిటీష్ పాలనాకాలం నాటి యథార్ధ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

