
చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ భిక్షపతి తెలిపారు.
భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకుని ఆదివారం ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతోపాటు మట్టి పాత్రల్లో బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.