కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్‌రెడ్డి పని
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టేందుకే సభలు పెడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిప ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
- సీఎంగా జిల్లాకు చెడ్డ పేరు..
- ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం
మద్దూర్, ఫిబ్రవరి 6 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టేందుకే సభలు పెడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిప ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలతో అధికారం చేపట్టిందని, తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలును తుం గలో తొక్కిందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ముందుకు వెళ్లడానికి భయపడుతూ తొండి మాటలతో ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రిని తిడుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్ర భుత్వం రూ.8లక్షల కోట్టు అప్పు చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించడం తగదని, తొమ్మిదేండ్లలో కేసీఆర్ రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే చేశారని, వాటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అవి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మీ హయాంలో రెండేళ్లలోనే రూ. 2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని,
మీరు కేవలం ఢిల్లీకి మూటలు మోయడం తప్పితే రాష్ర్టానికి చేసిందేమీ లేదన్నారు. మీ నియోజకవర్గానికి కూడా మీరు కొత్తగా చేసిందేమీ లేదని, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కట్టించిన దవాఖానలో కనీసం వైద్యులను నియమించే స్థితి కూడా మీకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్ననాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుపొందితే గత డిసెంబర్లో జరిగిన గ్రా మ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నలబై శాతం గెలుచుకుందని, ఇది కాదా మీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత అని గుర్తు చేశారు.
ప్రజలు కాంగ్రెస్ ఇస్తున్న మోసపూరిత హామీలు నమ్మితే గోసపడడం ఖాయమని, అందుకే అభివృద్ధి చేసే బీఆర్ఎస్కే ఓటు వేసి గులాబీ పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలను రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, నియోజకవ ర్గానికి కూడా ఆయన ఒక్క పనిచేయలేదని, ఆయన వల్ల ఉమ్మడి జిల్లాకు, నియోజకవర్గానికి కూడా చెడ్డపేరు వస్తున్నదని ఆరోపించా రు. కార్యక్రమంలో మద్దూర్, కొత్తపల్లి బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు గోపాల్, మధుసూదన్‌రెడ్డి, అబ్జర్వర్ కరాటే రాజు, దినేశ్, చికిని అంజి, శివకుమార్, బసిరెడ్డి, జగదీశ్వర్‌తోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

