Drugs | రాయపోల్ అక్టోబర్ 27 : గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్యం విజయ్ కుమార్ అన్నారు. సోమవారం సీపీ బేగంపేట, రాయపోల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత జిల్లాకు కృషి చేయాలని తెలిపారు. చట్ట వ్యతిరేకమైన అసాంఘిక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడిపే వాహనదారులపై దృష్టి సారించాలని తెలిపారు.
అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.గ్రామాలకు సంబంధించిన విపిఓలు రెండు మూడు రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.గ్రామాలలో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలన్నారు.
బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి..
ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి.జూదం, పేకాట, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలి. ఇసుక, మట్టి, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని, అధికారులకు సిబ్బందికి సూచించారు. పాత నేరస్తులైన కేడీలు, డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని.. ప్రతి శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సిఐ షేక్ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, రాయపోల్ ఎస్ఐ మానస, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
