KCR | తొగుట: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కోరుకునే విధంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి తొగుట ఎస్ఐ వి. నవీన్‌ను కలిసి ఫిర్యాదు చేసి, ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు.. ఒక నాయకుడి మరణాన్ని కోరుకోవడం వేరని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, వర్తించే చట్టాల ప్రకారం వీర్లపల్లి శంకర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగడం చేతగానితనానికి నిదర్శనమని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ను అవమానించే ప్రయత్నాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ప్రతిఘటిస్తాయని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీల మీద చర్యలు తీసుకున్న స్పీకర్, మరి ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, సర్పంచులు బక్క కనకయ్య, పన్యాల ప్రవీణ్ రెడ్డి, కోల వెంకటస్వామి గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, నాయకుడు సుతారి రమేష్, ఐలయ్య, నర్సీట్టి మల్లేశం, అరుణ్ కుమార్, రాజిరెడ్డి, బండారు స్వామి గౌడ్, కర్ణాకర్ తదితరులు ఉన్నారు.
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి